ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక ఆ జిల్లాలోని లోకల్ బాడీ ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లిందా? ఇతర జిల్లాల్లోని క్యాంపులు ఈర్ష్యగా మారాయా? పోటీ లేకపోవడంతో పదో.. పాతికో రాకుండా పోయాయని వాపోతున్నారా? వాళ్ల నారాజ్కు కారణం ఇదేనా? పోటీ ఉంటే పదో.. పరకో వస్తుందని ఆశించారట..! ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండుకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు పోటీలేకుండా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గులాబీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓటర్లయిన.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ… కౌన్సిలర్లు మాత్రం నారాజ్‌లో ఉన్నట్టు…
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి…
సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది,దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచినట్టు సిద్దిపేట లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నాం అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి చెత్త కుప్పలా తయారైంది,రాష్ట్రం ఓకె కుటుంబం గుప్పిట్లో బంది అయ్యింది. బీజేపీ వైపు చాలా మంది ఎదురు చూస్తున్నారు,వేములవాడలో ఎన్నికలు వస్తే…
ధాన్యం సేకరణపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన అధికార టీఆర్ఎస్.. తదుపరి కార్యాచణ ఏంటి? తాటతీస్తాం.. మెడలు వంచుతామని చెప్పిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. మరి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్..! తెలంగాణలో వరి రైతుల ఇక్కట్లు ఎలా ఉన్నాయో.. ధాన్యం రాశుల దగ్గర చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షం పాలై.. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక.. కొనుగోలు చేసేవారు…
కిట్టీ పార్టీలతో చిట్టీలతో చేసి డబ్బులు ఎగ్గొట్టిన శిల్ప కేసులో… పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. శిల్పను 3 రోజుల కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో ఆమెను చంచల్‌గూడ జైలునుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. ఇప్పటికే శిల్ప కాల్ రికార్డ్స్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆస్తులు, బినామీలపై ఆరా తీస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు శిల్పపై కేసు నమోదు అయింది. నార్సింగి ఎస్ఓటీ కార్యాలయంలో శిల్పను పోలీసులు మొదటిరోజు ప్రశ్నించారు. ఆమె జరిపిన…
తెలంగాణ సీపీజీఈటీ-2021లో మొదటి విడతలో సీట్లు సాధించిన వారు కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదిలను అధికారులు పొడిగించారు. రాష్ర్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉతీర్ణులై తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో ఈనెల15వ తేది వరకు రిపోర్టు చేయవచ్చని ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. కాగా అంతకముందు ఈ గడువు ఈనెల10 వరకు ఉండగా మరో 5 రోజులు పాటు పొడిగించినట్లు…
ఇంధనంతో నడిచే వాహనాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి.. రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాలు.. క్రమంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.. దీంతో, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు.. అందులో భాగంగా ఇప్పటికే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి.. భవిష్యత్‌లో వాహనరంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక భూమిక పోషించనున్నాయి.. ఇక, ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి శుభవార్త వినిపించింది తెలంగాణ ప్రభుత్వం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని…
తెలంగాణ ప్రభుత్వం మరోసారి అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు శుభవార్త చెప్పింది… వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను 30 శాతం పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకోవడం ఉత్తర్వులుజారీ చేయడం జరిగిపోయాయి.. అంగన్వాడీ హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలను 6,000 రూపాయల నుంచి 7,800 రూపాయలకు పెంచింది.. అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500 నుంచి 13,650 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, జులై నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానుండగా.. ఈ…
కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా.. ఎవరూ ఊహించని తరహాలో కొత్త తరహాలో కుచ్చుటోపీ పెట్టేస్టున్నారు.. తాజాగా.. సోలార్ ప్లాంట్ పేరుతో ఏకంగా రూ. 12 కోట్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.. ఈ కేసులో కీలకసూత్రధారిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమనగల్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతామని నమ్మించిన ఖుర్షీద్ అహ్మద్… సౌదీలో ఉన్న తన బంధువు…
అందోల్ లో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆరోపణలు చేసారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్. టీఆర్ఎస్ రెండవ సారి గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు దామోదర్ ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో అన్న విషయం దామోదర తెలుసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ప్రవేశ పెట్టిన పథకాలు లీడర్ల జెబుల్లోకి వెళ్ళేవి..టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరుగా ఆన్ లైన్ ద్వారా…