జనవరి 2 వరకు ఆంక్షలు.. డీజీపీ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనల్లో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని తెలిపారు డీజీపీ మహేందర్‌రెడ్డి.
కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తమైంది ప్రభుత్వం.. ఎయిర్ పోర్ట్‌లో కూడా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని తెలిపారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం.. ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం అన్నారు.. విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ లు ధరించి డ్యూటీ చేయాలని స్పష్టం చేశారు. ఇక, పబ్బులు, ఈవెంట్స్ పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్‌రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?