తాగి వాహనం నడిపితే పబ్‌లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్‌లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్‌ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని విచారిస్తామని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక, తాగిన వారికి డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్న కోర్టు.. డీజే సౌండ్‌లో పై 45 డెసిబల్స్ మించకుండా చూడాలని.. ఈ నిబంధనలు జనవరి 3వ తేదీ అర్థరాత్రి వరకు అమలు చేయాలని స్పష్టం చేసింది.
Read Also: శ్రీవారి ఆలయంలో జనవరిలో విశేష ఉత్సవాలు.. ఏ రోజు ఏంటి..?
ఇక, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పోలీసు శాఖ తరుపు న్యాయవాది కోరగా.. హైకోర్టు ఒప్పుకుంది.. ఎక్సైజ్ శాఖను ప్రతివాదులుగా చేర్చాలని తెలిపింది.. మరోవైపు, మైనర్లను పబ్‌లలోపలికి అనుమతించవద్దు అని స్పష్టం చేసింది హైకోర్టు.. పేరెంట్స్ తో పాటు వచ్చిన మైనర్లను కూడా అనుమతించొద్దు అని సూచించింది.. వేడుకలపై హైకోర్టు ఆదేశాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరుస్తూ పోలీస్ గైడ్ లైన్స్ ను పాటించాలని సూచించింది.. తదుపరి విచారణలో హైకోర్టుకు అందే నివేదికల ఆధారంగా విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో.. హైదరాబాద్ పోలీసులు ఊహించిన దాని కంటే ఎక్కువగానే చర్యలు తీసుకున్నట్లు అభిప్రాయపడింది హైకోర్టు.. పబ్‌ల ముందు హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశిస్తూనే.. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యతని స్పష్టం చేసింది.. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 6వ తేదీన జరగనుంది.