పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదీ ఏ ముస్తఫా నగర్‌లోని పెళ్లిళ్లకు డెకరేషన్ చేసే గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళానికి వారికి సమాచారం చేరవేశారు.
Gajarla Ganesh : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామం ఈరోజు తీవ్ర ఉద్వేగానికి లోనైంది. మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ మృతి పట్ల గ్రామవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి తరువాత గాజర్ల రవికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం వెలిశాలలో అతని అంత్యక్రియలు జరగనున్నాయి. గాజర్ల రవి మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆయన అభిమానులు, మావోయిస్టు సానుభూతిపరులు,…
డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!! ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్గా అనిపిస్తోంది కదూ..!! అవును మరి అలాంటిదే బంపర్ ఆఫర్..!! ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా కోటి రూపాయలు కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. సొంత ఇల్లు ఎవరికైనా ఓ కల. సొంత ఇల్లు ఉండాలి.. ఇది ఎవరికైనా ఓ కల..డబుల్ బెడ్రూమ్…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మూడు విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్, ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల…
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గోదాంలో…
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుని హత్య కలకలం సృష్టించింది. చందానగర్ లోని గిడ్డంగి కల్లు కంపౌడ్ లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నలుగురు మిత్రులు కళ్ళు కాంపౌండ్‌లో కళ్ళు తాగడానికి వచ్చారు. అమ్రేష్ అనే యువకుడిని అతని ముగ్గురు స్నేహితులు కలిసి చంపేశారు. ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది.
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అనిల్ కుమార్, హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఐపీఎస్ జితేంద్ర పని చేశారు. జితేందర్, అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భూమి తగాదా విషయంలో అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపారు. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు.
తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో దిల్సుఖ్నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.