నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత:
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి మరింత బలం చేకూరనుంది. బాలసుబ్రమణ్యం పార్టీని వీడడం రాజకీయంగా టీడీపీకి దెబ్బే అనే చెప్పాలి.
అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య:
అనంతపురం జిల్లాలో మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు నిన్న దారుణహత్యకు గురయ్యాడు. నేడు అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సర్వేయర్ హత్యలో సంచలన విషయాలు:
తెలంగాణాలో సంచలనం సృష్టించిన గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సంబంధించిన ప్రధాన నిందితుడుగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుగా పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ కేసు సంబంధించి పోలీసుల విచారణనలో తిరుమలరావు తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు తెలిసింది. ఇకపోతే గత కొంతకాలంగా తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా.. తిరుమలరావుకు పెళ్లై 8 ఏళ్లవుతున్న సంతానం లేకపోవడంతో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అనుకున్నాడు. దీనితో జీవితంలో అడ్డుగా ఉన్న తన భార్యతో పాటు, సర్వేయర్ తేజేశ్వర్ ను కూడా అడ్డు తొలగించాలనుకున్నాడు. ఈ కారణంగానే తేజేశ్వర్ ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ ను నియమించినట్టు సమాచారం. అలాగే తిరుమలరావు భార్యను చంపి ప్రియురాలితో విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు.
నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్న కామారెడ్డి నేతలు:
తెలంగాణలో భారీ సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. గతంలో అధికారంలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొందరు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పలు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వాధికారులు వంటి అనేక మంది టార్గెట్ అయినట్లు బయటపడడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
రేపటి నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు:
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందారు. ఆకాశం వైపు చూస్తున్న కర్షకులకు తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశమంతా వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు రాష్ట్రాలను ఐఎండీ హెచ్చరించింది. ఇక జూన్ 26 నాటికి ఢిల్లీకి రుతుపవనాలు చేరతాయని.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఢిల్లీ టూర్‌లో హీరోయిన్ మీనా:
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు. ‘‘మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది.. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్ నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు’’ అంటూ మీనా రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రకరకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమిళ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ:
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రతా, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ కారణంగా భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం, విమాన ప్రమాద నివారణ చర్యలపై కూడా చర్చించనున్నరు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించనున్నారు.
నేడు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా:
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షంలోకి వెళ్తున్నారు. రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించబోతున్నాడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ రికార్డ్‌ను 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగ రాస్తున్నాడు. అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టనున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్ర మండలానికి వెళ్లింది ఈ ప్రదేశం నుంచి కావడం విశేషం. 39 ఏళ్ల శుభాంశు శుక్లాను ఫైటర్ పైలట్‌గా ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది. నలుగురు సభ్యుల బృందం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.
52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రేస్:
64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి 17 సెం.మీ పొడవున్న బ్రష్‌ను తొలగించడానికి వైద్యులు 80 నిమిషాలు పట్టింది. బ్రష్ లోపల కుళ్ళిపోయి ఉంటుందని ఆ వ్యక్తి అనుకున్నాడు.
ఒక్క టెస్టులో 5 సెంచరీలు.. కానీ ఏం లాభం..?
భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ చివరి, ఐదవ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్ జట్టుకు విజయంకోసం 350 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులు చేసి విజయానికి బాటలు వేశారు. ఇక భారత్ తరపున శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
ధనుష్ టాలీవుడ్ టార్గెట్ క్లియర్:
నాగార్జున , ధనుష్ , రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుబేరా’. గతవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోంది. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్‌పర్ట్ చేయలేదంటూ ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేస్తున్నారు. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక మెగా బ్లాక్‌బస్టర్‌గా అవతరిస్తున్న ‘కుబేర’ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ చిత్రంగా నిలవడంతో ధనుష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో అదరగొడుతున్న అభిషేక్ బచ్చన్:
థియేటర్లకు జనాలను రప్పించడంలో ఫెయిల్యూరైన అభిషేక్ ఓటీటీలో మాత్రం సక్సెస్ అవుతున్నాడు. రొటిన్ రొడ్డకొట్టుడు చిత్రాలను కాదని డిఫరెంట్ స్టోరీలతో డిజిటల్ ప్రేక్షకుల మనస్సు దోచేస్తున్నాడు. ఫాదర్ రోల్స్ చేసిన బ్రీత్ ఇన్ టూ ద షాడోస్, బీ హ్యాపీ చిత్రాలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. కానీ ఐ వాంట్ టు టాక్ మాత్రం థియేటర్లలో మెప్పించలేకపోయింది. ఈ మధ్యలో హౌస్ ఫుల్ 5లో వన్ ఆఫ్ ది హీరోగా కనిపించినప్పటికీ క్రెడిట్ అక్షయ్ ఖాతాలో చేరిపోయింది. గతంతో పోల్చుకుంటే స్క్రిప్ట్ సెలక్షన్‌లో సక్సెస్ అవుతున్నాడు అభిషేక్. ఓటీటీ, థియేటరా అనేది పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో 2019లో తమిళంలో వచ్చిన కేడీని రీమేక్ చేస్తున్నాడు. ‘కాలిదార్ లాపతా’ జీ5లో జులై 4న స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు అభిసేక్. అలాగే నెక్ట్స్ షారూఖ్ ఖాన్ కింగ్‌లో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్. అలాగే రాజా శివాజీలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. కెరీర్ డ్యామేజ్ అవుతున్న టైంలో యూటర్న్ తీసుకుని లైమ్ లైట్లో అందులోనూ మెయిన్ లీడ్స్ చేస్తోన్న అభిషేక్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రేస్ లో దూసుకెళ్తున్నాడు.
నితిన్ మేనకోడలిగా నటించిన చిన్నారి ఎవరో తెలుసా:
మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హారోలో నితిన్ ఒకరు. ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్ చేసిన ఆయనకు ఈ మధ్య సరైన సక్సెస్‌లు కరువయ్యాయి. చివరిగా వచ్చిన ‘రాబిన్ హుడ్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు అనో ఆశలతో ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది. లయ ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్రలో కనిపించనుంది. ఇక లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది. ఆ పాప ఈ మూవీలో కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ లో నితిన్ పక్కనే కనిపించింది. దీంతో ఈ సినిమాలో నితిన్‌కి మేనకోడలుగా నటిస్తున్న పాప ఎవరనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఆ పాప పేరు దీత్య ఈ పాప ఎవరో కాదు ‘తమ్ముడు’ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూతుర్నే అంటా. ఈ సినిమాతో తన కూతురు దీత్యని నటింప చేస్తున్నారు. దీత్య కూడా ప్రమోషన్స్ లో పాల్గొని తన క్యూట్ క్యూట్ మాటలతో అందరిని అలరిస్తుంది. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది.ఈ సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.