Jurala : కృష్ణా నదికి భారీ వరద.. జూరాల ప్రాజెక్టులో 12 గేట్లు ఎత్తి నీటి విడుదల
- జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద
- 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
- ఇన్‌ఫ్లో లక్షా 30 వేల క్యూసెక్కులు
- ఔట్‌ఫ్లో లక్షా 44,076 క్యూసెక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.200 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దీనివల్ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ప్రవాహం గణనీయంగా పెరిగింది.
Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు
Also Read
ఇటీవల డ్యామ్‌కు సంబంధించిన 9వ గేట్ రోప్ తెగిపోయిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దీంతో పాటు మరో రెండు గేట్ల రోప్‌లు బలహీనంగా ఉండటంతో ఆయకట్టు రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అధికారులు స్పందిస్తూ.. ఎలాంటి ప్రమాదం లేదని, అవసరమైన ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోప్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో మొత్తం 67 రేడియల్ గేట్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది గేట్ల రోప్‌లు తుప్పుపట్టినట్లు గుర్తించగా, ఇప్పటికే నాలుగు రోప్‌లు మార్చారు. మిగతా నాలుగు రోప్‌లు మార్చేలోపే వాటిలో ఒకటి తెగిపోయింది. వరద ఉధృతి దృష్టిలో ఉంచుకుని, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Ivory Smugglers: హైదరాబాద్‌లో ఏనుగు దంతాల కేసు.. కొనసాగుతున్న విచారణ
తాజావార్తలు
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?