Tragedy : ఇది ప్రేమ పెళ్లి కాదు. కానీ, ఒక కొత్త జీవితంపై కలలు కంటూ అడుగుపెట్టిన నవ వధువు.. ఆ జీవితం బంధనంగా మారుతుందని ఊహించలేకపోయింది. భర్త వేధింపులతో ఆమె ఉక్కిరిబిక్కిరై, చివరకు ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు KPHB లో ఓ ప్రైవేట్ షాపులో సెల్స్ మాన్‌గా పని చేస్తుంటాడు. అతడు, పూజిత అనే యువతిని…
రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9…
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్ ఫోర్స్ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్…
వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కిక్కుకోసం జనం జీవితాలతో ఆడుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్లు. కల్తీ కల్లు తయారు చేస్తూ జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అాలాంటి ముఠాకు నిర్మల్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆల్పాజోలం, క్లోరో హైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను భారీ ఎత్తున పట్టుకున్నారు. బీరు.. బ్రాందీ.. విస్కీ.. వోడ్కా.. ఇలాంటి ఆల్కహాల్ తాగడం కంటే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతుంటారు. కానీ ఆరోగ్యం మాట దేవుడెరుగు.. అసలు ఇప్పుడు…
అధికారం చేతులో ఉంది కదా.. ఆటలాడుకున్నారు ఆ పోలీసులు. కంచే చేను మేసింది అనే విధంగా నడుచుకున్నారు. ఇల్లీగల్ మనీ ఉంటే దాన్ని నిర్ధారించి కేసు బుక్ చేయాల్సింది పోయి.. విడిచి పెట్టేందుకు లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో సస్పెండ్ అయ్యారు. కట్టల కొద్దీ డబ్బు చూసి ఆశ పెరిగింది..కట్టల కొద్దీ డబ్బులు చూసి వారిలో ఆశ పెరిగింది.. కోట్లు కళ్ల ముందు ఉండడంతో రూల్స్ పక్కకు పెట్టేశారు.కోట్ల రూపాయలు కళ్ల ముందు…
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను.
క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే…