Local Body Elections : తెలంగాణలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో, బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 22,330 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలు, బుజ్జగింపుల తరువాత 395 గ్రామాలు ఏకగ్రీవం అయినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటిలో వికారాబాద్ జిల్లా 39 గ్రామాలతో అత్యధిక ఏకగ్రీవాలు నమోదు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33…
హయత్‌నగర్‌లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావడం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డ్ చేయడం, తరువాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవడం.. ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో జరిగినట్లు…
Traffic Challan Discount : ఒక్కసారిగా సోషల్ మీడియా చూసి “చలాన్లపై భారీ డిస్కౌంట్ వచ్చిందట… 100% రాయితీ కూడా ఇస్తారట!” అని నమ్మతే పప్పులో కాలేసినట్లే. ట్రాఫిక్ చలాన్లపై భారీ తగ్గింపుల పేరుతో తిరుగుతున్న ఈ ప్రచారం మొత్తం ఫేక్ అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ఇది మంచి అవకాశం అనుకుంటున్న వాహనదారులు అసత్య సమాచారానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. Pawan Kalyan: గుర్తింపు కోసం నేను…
Bomb Blast : కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం బాంబు కలకలం సృష్టించింది. మొదటి ప్లాట్‌ఫామ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన నల్లటి సంచిలో ఉన్న నాటు బాంబు పేలడంతో ఒక వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఉదయం వేళ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్ పక్కన రైల్వే ట్రాక్‌పై ఉంచిన నల్లటి సంచిని ఒక వీధి కుక్క ఆహారంగా భావించి తినే…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేసిన కవిత, పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ “తెలంగాణ నాయకుల దిష్టి…
Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్‌డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం! భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన…
హైదరాబాద్ మెట్రో రైలు దేశంలో అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు ఐదు లక్షల ప్రయాణికులకు సేవలందిస్తూ, నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీ ప్రయాణికుల్లో మహిళల శాతం సుమారు 30 ఉండటంతో, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా నిలుస్తున్నాయి. సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా,…
Shamirpet Police Station : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో…