Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్‌కు తీసుకెళ్తుండగా, ప్రమాదం జరిగింది.
Jagannath Rathyatra: జగన్నాథ రథయాత్రలో ఏనుగుల బీభత్సం.. పరుగులు తీసిన జనం
పల్లవి స్కూల్ సమీపంలోని జంక్షన్ వద్ద అకస్మాత్తుగా వేగంగా వచ్చిన టిప్పర్ స్కూటీకి ఢీకొట్టింది. ఈ ఢీకొట్టే సమయంలో స్కూటీ నుంచి పడిపోయిన అభిమన్యును టిప్పర్ తొక్కేయడంతో అతడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.