MIlk : కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు…
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ కాలంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై విచారణ కోసం ఆయన సోమవారం ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారుల ముందు హాజరయ్యారు. భరత్ భూషణ్ ఫోన్ టాపింగ్ వ్యవహారం గత ఎన్నికల సమయంలో జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఎన్నికలకు…
KTR : తెలంగాణలో పేదల ఇళ్లపై, పోడు భూములపై బుల్డోజర్ల దాడులు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్లోని పేదల ఇండ్లు కూల్చడం తర్వాత, ఇప్పుడు ఆదివాసీల పోడు భూములపైనా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్, “పేదలపైనా, అడవులపైనా ఇప్పుడు బుల్డోజర్లు దాడి చేస్తున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసి జీవిస్తున్న ఆదివాసీలపై పోలీసులు దాడి చేయడం అమానుషం” అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం…
Phone Tapping : తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు లోనైన ఆయన, ఈసారి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం…
Tragedy : ఇది ప్రేమ పెళ్లి కాదు. కానీ, ఒక కొత్త జీవితంపై కలలు కంటూ అడుగుపెట్టిన నవ వధువు.. ఆ జీవితం బంధనంగా మారుతుందని ఊహించలేకపోయింది. భర్త వేధింపులతో ఆమె ఉక్కిరిబిక్కిరై, చివరకు ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు KPHB లో ఓ ప్రైవేట్ షాపులో సెల్స్ మాన్గా పని చేస్తుంటాడు. అతడు, పూజిత అనే యువతిని…
రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9…
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్ ఫోర్స్ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్…
వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కిక్కుకోసం జనం జీవితాలతో ఆడుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్లు. కల్తీ కల్లు తయారు చేస్తూ జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అాలాంటి ముఠాకు నిర్మల్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆల్పాజోలం, క్లోరో హైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను భారీ ఎత్తున పట్టుకున్నారు. బీరు.. బ్రాందీ.. విస్కీ.. వోడ్కా.. ఇలాంటి ఆల్కహాల్ తాగడం కంటే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతుంటారు. కానీ ఆరోగ్యం మాట దేవుడెరుగు.. అసలు ఇప్పుడు…