శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.. ఆత్మహత్య చేసుకునేందుకు కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం తాను ఉంటున్న ప్లాట్ నుంచి కార్ తో సహా బయటికి వచ్చింది సోనీ. తన దగ్గరున్న కుక్కను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలి వెళ్ళిపోయింది. సూసైడ్ చేసుకోవడానికి కార్ తీసుకొని రైలు పట్టాలపైకి వచ్చింది.
కుటుంబ కలహాలే దీనికి ప్రధాన కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. టెండర్లు ఖరారు
ఆర్మీలో జాబ్ చేయాలని సోనీ ప్రయత్నం చేసింది.. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. మరోవైపు తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఉద్యోగం తొలగించారు. తల్లిదండ్రుల ఆర్మీ జాబు నిరాకరణ, ఉద్యోగం పోవడంతో మానసిక ఆందోళన చెందింది. కార్ తో సహా ట్రైన్ కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసింది.
READ MORE: UP: డ్యూటీ టైమ్‌లో ఇన్‌స్టా రీల్స్ చేసిన ‘లేడీ సింగం’.. ఉన్నతాధికారులు ఏం చేశారంటే..?