దారుణం.. భార్య, మామ చేతిలో భర్త హత్య..! వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో…
మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్‌లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్..…
CM Revanth Reddy : రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు సగటుతో పోల్చితే 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం…
గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మమల్ని వేధిస్తున్నారు..! నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం…
SLBC : నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలను కుదిపేసిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి 150 రోజులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలడంతో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలనే వెలికితీశారు, మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాలు టన్నెల్‌లోనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నో గో జోన్‌గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. 63 రోజుల పాటు జరిగిన రెస్క్యూ…
“బిట్రా ద్వీపం”లో మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. నేరుగా పాక్, చైనాలపై గురి.. భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా…
Caste Census : రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు సమావేశమయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్…
Suicide : మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్‌లోని ఓ లాడ్జ్‌లో మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వీడియో రూపంలో రికార్డు చేసి తన ఆఖరి మాటలు చెప్పాడు. హావేలిఘనపూర్ మండలంలోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న రమేష్ (45) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. అప్పుల భారంతో ఇల్లు, బంగారం,…
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరంగల్, ఖాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం. వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లు మంజూరు చేశాం. దీని ద్వారా 3వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది.…
చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు ఉపన్యాసం హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1996, 99 ఎన్నికల సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబుదే.. 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించిన ఘనుడు కూడా చంద్రబాబే.. హంద్రీనీవా ప్రాజెక్టు…