Srushti IVF Center : తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ప్రకంపనలు.. వెలుగులోకి సంచలన విషయాలు
- సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం
- డీఎన్‌ఏ పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారణ
- వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పోలీసుల సోదాలు
- సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srushti IVF Center : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై సంచలనం రేగుతోంది. ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం, ఆసుపత్రి నిర్వాకం వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానం డీఎన్‌ఏ పరీక్షలతో నిజమైంది. ఇది పెద్ద ఎత్తున అక్రమాలకు, అనైతిక పద్ధతులకు అద్దం పడుతోంది.
టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సృష్టి సెంటర్‌ను ఆశ్రయించిన దంపతులకు మగబిడ్డ పుట్టాడు. అయితే, బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితమే బాబుకు క్యాన్సర్ అని తేలడంతో దంపతులు షాక్‌కు గురయ్యారు. దీంతో మరో డాక్టర్‌ను సంప్రదించి డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిడ్డ డీఎన్‌ఏ తమ వీర్యకణాలతో సరిపోలడం లేదని, మరొకరి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆగ్రహించిన దంపతులు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయించారు.
Also Read
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. తొమ్మిదేళ్ల క్రితం, అంటే 2016లో కూడా NTV చేసిన స్పై ఆపరేషన్ కారణంగా ఈ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. అప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మూసివేసిన ఈ సెంటర్‌ను, డాక్టర్ నమ్రత మళ్ళీ అక్రమంగా అనుమతులు పొంది నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు వెల్లడైంది.
సికింద్రాబాద్‌లో కేసు నమోదైన వెంటనే, వైజాగ్‌లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఉన్నతాధికారులు రెండు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. కొందరు యువకులకు డబ్బు ఆశ చూపి అక్రమ పద్ధతిలో వీర్యం సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ నమ్రత ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నట్లు తెలిసింది. ఎవరైనా దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే, విజయవాడ నుంచి వచ్చి చికిత్సలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు డాక్టర్ నమ్రతను విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.
సంతానం కోసం ఆశపడే దంపతుల నమ్మకాన్ని ఆసరా చేసుకొని వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ క్లినిక్‌ల పారదర్శకత, నియంత్రణపై మరోసారి చర్చను రాజేసింది.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!