Jagtial District: కొడుకంటే కష్టాలు కడతేర్చేవాడు.. కొడుకంటే కడుపున పెట్టుకొని కాపాడేవాడు.. కొడుకంటే ఇంటి బరువు మోసేవాడు.. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. మరి ఇక్కడ మాత్ర సీన్ రివర్స్ అయ్యింది. కర్కోటకుడిగా మారిన కొడుకు కన్న తండ్రినే దారుణంగా పొడిచేశాడు. 10 గుంటల భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడి తండ్రీకొడుకుల బంధానికే కంట నీరు తెప్పించాడు. కని, పెంచి పెద్దచేసి ‘ప్రయోజకుడిని’ చేసినందుకు ప్రతిగా పేగుబంధమే వలవల ఏడ్చేలా చేశాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది.. 10 గుంటల భూమి కోసం ఓ తనయుడు తండ్రిని కత్తితో పొడిచాడు. మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు.
READ MORE: Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ
చిన్న కూతురు వివాహానికి చేసిన అప్పులు తీరక పోవడంతో 10 గుంటల భూమిని అమ్మేందుకు ఆ తండ్రి సిద్ధమయ్యాడు. భూమి అమ్ముతున్నాడని రాజేందర్ తండ్రిపై కోపం పెంచుకున్నాడు. స్నేహితుడితో కలిసి తండ్రి లక్ష్మీనర్సయ్యపై నిన్న రాత్రి కత్తులతో దాడి చేశాడు. లక్ష్మీనర్సయ్యకు కడుపులో 8 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE:Prakash Raj: ఐదు గంటల పాటు లోపల జరిగింది ఇదే.. ఈడీ విచారణపై స్పందించిన ప్రకాశ్‌రాజ్