Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని హన్సిక (14) ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులు, స్నేహితులను మృదువుగా కలిచివేసింది. ఈ ఘటన మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హన్సిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం సమయంలో ఆ బాలిక అపార్ట్మెంట్ భవనం పై నుండి దూకింది. Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్…
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లకు ఆమోదం తెల్పనున్న కేబినెట్ ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఏపీ సీఈఓ సమావేశం.. ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ.. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించే అవకాశం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి.. అమ్మవారికి బోనాలు సమర్పించనున్న భక్తులు నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4వ రోజుకు చేరుకున్న వైసీపీ…
Skeleton : ఖమ్మం జిల్లా కుక్కల గుట్టలో గుర్తు తెలియని మహిళ ఆస్తిపంజరం ఖమ్మం జిల్లాలో మరోసారి కలకలం రేపింది. గడిచిన ఐదేండ్లలో ఇదే కుక్కల గుట్టలో తనను ప్రేమించడం లేదని ఒక సైకో.. విద్యార్థినిని హత్య చేశాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేశాడు భర్త. ఈ రెండు సంఘటనలు ఇదే ప్రాంతంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అసలు కుక్కల గుట్టపై ఏం జరుగుతోంది? తాజాగా గుర్తు తెలియని మహిళ అస్థి…
WhatsApp Emoji Dispute Turns Deadly in Suryapet: వాట్సాప్ ఎమోజీ ఓ వ్యక్తి నిండు ప్రాణం బలితీసుకుంది. ఈ ఘటన సూర్యాపేటలో జరిగింది. పద్మశాలి కుల సంఘం సూర్యాపేట టౌన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యమే ఈ ఘటనకు కారణమైంది. ఆ ఎన్నికలకు సంబంధించి కొద్దిరోజులుగా వాట్సాప్ వేదికగా సంఘ సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఆగస్టు మూడో తేదీన సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు జరపటానికి ఆ సంఘం పెద్దలు ప్రకటన…
దారుణం.. భార్య, మామ చేతిలో భర్త హత్య..! వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో…
మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్‌లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్..…
CM Revanth Reddy : రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు సగటుతో పోల్చితే 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం…
గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మమల్ని వేధిస్తున్నారు..! నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం…
SLBC : నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలను కుదిపేసిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి 150 రోజులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలడంతో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలనే వెలికితీశారు, మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాలు టన్నెల్‌లోనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నో గో జోన్‌గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. 63 రోజుల పాటు జరిగిన రెస్క్యూ…
“బిట్రా ద్వీపం”లో మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. నేరుగా పాక్, చైనాలపై గురి.. భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా…