Jayashankar Bhupalpally: ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లోకి బర్రెలను తోలిన పాడిరైతు.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: Nara Lokesh: ప్రభుత్వం మారిపోతుందని ఈ-మెయిల్ పంపారు.. ఎవరా అని చూస్తే..!
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
పాడి రైతు కూరాకుల ఓదెలు తన బర్రెల కోసం ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు దాన్ని కూల్చివేశారు. దీంతో ఆవేదనకు గురైన ఓదెలు ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసులోకి బర్రెలను తోలాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ లోకి గేదలు రావడంతో అందరూ హైరానా పడ్డారు. కార్యకర్తలు.. పోలీసులు వాటిని బయటకు పంపించేశారు. అక్కడే తనకు న్యాయం కావాలంటూ ఓదెలు కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. “ఒక్కగానొక్క షెడ్డును కూల్చేశారు. నా బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి. ఎమ్మెల్యే ఈ అంశంపై స్పందించాలి. నాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదెలును ఆయన భార్యను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
READ MORE: GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు