నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా... మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు అని.. పవిత్రమైన వృత్తి నర్సింగ్ని ఎంచుకున్న అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. ఏపీలో నర్సింగ్ కౌన్సిల్లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయని, నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం…
వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి…
ఈరోజు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో.. అవిశ్వాస తీర్మానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి.. టీడీపీలో ఉన్న కౌన్సిలర్కు వైస్…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. అన్ని పార్టీలకు చెందినవారికి సముచిత స్థానం కల్పిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. ఇవాళ 22 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ మరో లిస్ట్ విడుదల చేశారు..
బాహుబలి రెండే పార్టులు.. కానీ, కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు.. అంటే పది పార్టుల వరకు ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోన్న వేళ.. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు వెంకన్న.. పదేళ్లు పార్లమెంటు మెంబర్గా ఉండి ఆ పార్టీని, అధ్యక్షుడుని లెక్క చేయకుండా మట్లాడిని వ్యక్తి నాని అని ఫైర్…
40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను మంత్రి నారాయణ పరిష్కరించారు. నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజు అని…
వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ.. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు..
ఆయన వైసీపీ మాజీ మంత్రి…అధికారంలో ఉన్నపుడు టీడీపీ, జనసేనలో ప్రధాన నేతలపై హద్దులు దాటి విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ మాజీ మంత్రి అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడలి పోతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు బెంబేలెత్తి పోతున్నారు. లెట్స్ వాచ్. జోగి రమేష్…ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నేత. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మొదలు పవన్…
కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక అధిక రేట్లు పెంచేస్తున్నారని…