ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏపీలో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. అయినా కూడా ఇప్పటివరకు కూటమి నుంచి నామినేషన్ దాఖలు అవ్వలేదు. ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ…
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.. ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరు అయ్యారు.. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు..
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది..
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ, వైసీపీల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది.. నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనుహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలర్ట్ అయ్యారు.. మరోవైపు కూటమి అభ్యర్దిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్.. వైఎస్ జగన్ మానసిక స్థితి బాగాలేదని ప్రజలు గమనించారని.. అందుకోసమే లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారని.. అది సెట్ అవ్వని పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధిని చూసి మరింత మానసిక శోభకు గురైతే ప్రభుత్వం తరఫున అన్ని విదాల ఆయనకు సహకరిస్తూ మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాంమని సెటైర్లు వేశారు కార్మిక శాఖ మంత్రి సుభాష్.
డొక్కా మాణిక్య వరప్రసాద్.... ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2004లో గుంటూరు జిల్లా తాడికొండనుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2009లో కూడా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు మాజీమంత్రి. ఇంకా చెప్పాలంటే... ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. అందు కారణం అంతా స్వయంకృతమేనంటారు పొలిటికల్ పండిట్స్. నిలకడలేని నిర్ణయాలతో తన రాజకీయ…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్న ఆయన.. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూస్తున్నారు.. అసలు చంద్రబాబు హీరో కాదు.. విలన్.. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారని హాట్ కామెంట్లు చేశారు.. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానని అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి…
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని, క్యూబిక్ మీటర్ ఒక్క రూపాయుకే, రైతులకు సరఫరా చేసేలా అనుమతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు.
Kesineni Chinni vs Kesineni Nani: విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. మాజీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ ఎంపీ చిన్ని లీగల్ నోటీసు పంపించారు. రూ. 100 కోట్లు నష్ట పరిహారం కోరుతూ ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. కాగా, కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని ఓ పోస్ట్ పెట్టారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం అని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.