2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం…
వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాత్ర గురించి అందరికీ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారని, బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా? అని అన్నారు. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని ఎమ్మెల్సీ బీదా…
Anil Kumar Yadav: అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారని తెలిపారు. ఇక, శోభారాణి మైన్ కు రూ. 32 కోట్ల మేర ఫైన్ విధించారు.. మైన్స్ శాఖ అధికారి నాయక్.. విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారు.
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి కాపు నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కాపు నాయకుడు ఒక్కరు కూడా మంత్రిగా లేరు.. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా తూర్పుగోదావరి నుంచి... వెసులుబాటును బట్టి ఒకరు లేక ఇద్దరు కాపు నేతలు మంత్రులుగా ఉండేవారు.
ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు..
Ambati Rambabu: అమరావతి పునః ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి ఒక అంతులేని కథ.. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు అని మండిపడ్డారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది.. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో... ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని... జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి.. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు..