Sri Krishna Devarayalu: తీవ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల అఖిలపక్ష సమావేశంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దీక్షిత్ వివరించారని టీడీపీ నాయుకుడు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తీవ్రవాదం, జాతీయ భద్రత పై సహకరిస్తామని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. గత పదేళ్ళుగా కాశ్మీర్ లో ఏ విధంగా భద్రతను పెంచారో వివరించారని, తీవ్రవాద చర్యలను భద్రత సిబ్బంది ఏవిధంగా ఎదుర్కొంటున్నారో తెలిపారని అయ్యన అన్నారు. జాతీయ భద్రతపై ఏ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి నిలబడి ధైర్యంగా పోరాడిన ప్రజాప్రతినిధులందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు అత్యంత కష్టాల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఇది దుర్మార్గమైన రెడ్బుక్ పాలన. ప్రజావ్యతిరేకతను ఎంత అణిచివేయాలనుకున్నా సాధ్యం కాదు” అని…
సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి.. అప్పు.. సంపద పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలో మద్దతు ఉంది అని చెప్పుకుంటున్నారు..
ఒంగోలులో టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం…
Chelluboyina Venu: తన మనుషులకు లబ్ధి చేకూర్చటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ పాలసీనే మార్చారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. దీని వల్ల సంవత్సరానికి 1100 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో 5500 కోట్లు ఖజానాకు నష్ట వచ్చిందని తెలిపారు.
Margani Bharat: చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్పిలరీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నాలుగైదు డిస్టిలరీలకు అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చేవారని ఆరోపించారు.
దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలులో కలకలం రేపింది. మంగళవారం రాత్రి 7.30 గంటల…
2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
Gudivada Amarnath: విశాఖలో భూ కేటాయింపులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెల్ కంపెనీల సృష్టికర్త చంద్రబాబు అని ఆరోపించారు. షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు.
Minister Anagani: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం ప్రస్తుతం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటిని చూసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడుపు మండుతోంది అన్నారు.