Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీకి, మేయర్ స్రవంతికి సంబంధం లేదు.. వైఎస్ జగన్ ను కలిసిన వెంటనే ఇద్దరు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. టీడీపీ విధానాలు నచ్చక తిరిగి వైసీపీ గూటికి వచ్చిన కార్పొరేటర్స్ ను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది
YSRCP : నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈనెల 18న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గతంలో వైఎస్సార్సీపీ తరపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వలస వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు ఇప్పుడు తిరిగి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని ప్రకటించడం విశేషం. మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఈ ఐదుగురు కార్పొరేటర్లు, తమ నిర్ణయాన్ని ఆయన సమక్షంలో…
Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశానికి నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఫైల్ క్లియరెన్స్ లో ఆరు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అని సూచించారు.
Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత.. క్రియశీల గుడివాడ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యక్షమైయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నారు.
CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, హెచ్వోడీలు, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు.
CM Chandrababu: ఇవాళ (డిసెంబర్ 10న) సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశం జరగనుంది. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 45 గంటల వరకూ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించనున్నారు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ యాదవులపై ఎదో మాట్లాడారని కూటమి నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. అసలు జగన్ ఏం మాట్లాడారు అనేది యాదవ సోదరులతో పాటు అందరూ తెలుసుకోవాలన్నారు. యాదవులకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ద్రోహం చేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందన్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారం నడిపింది…
ఏపీ మినిస్టర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి పర్యటన ఒకసారి కాదు.. ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ సబ్జెక్ట్. ఎలాంటి బలమైన కారణం లేకుండా.. ఆ స్థాయి నాయకుడి పర్యటనను ఏకంగా మూడు సార్లు ఫిక్స్ చేసి వెంటనే ఎందుకు కేన్సిల్ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.