అర్ధిక అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకే మేలు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మహమ్మారి కరోనా సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారని, చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారి పోయాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదలచుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ మహానాడు బహిరంగ సభ తర్వాత కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బాబు కలిసే అవకాశముంది. యోగా దినోత్సవంకు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత…
కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల…
ఆ జిల్లాలో తమ్ముళ్ళను తగ్గమని తలంటేశారా? మరీ… ఓవర్ స్పీడ్ అయిపోవద్దని టీడీపీ పెద్దల నుంచి వర్తమానం అందిందా? మిమ్మల్ని ఎలా సెట్ చేయాలో మాకు తెలుసునంటూ వార్నింగ్లు సైతం వచ్చాయా? ఎక్కడి టీడీపీ నేతలకు ఆ స్థాయి వార్నింగ్స్ ఇచ్చారు? ఎందుకా పరిస్థితి వచ్చింది? కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్ళు కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవుల పందేరంలో తమను పక్కనపెట్టి జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బహిరంగంగానే బరస్ట్ అవుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై…
పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ స్టేట్ గా క్రియేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జిటిక్ అప్పుగా మారబోతుంది.. కరెంట్ ఛార్జీలు పెంచను అని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
CM Chandrababu: మహానాడులో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు అని ఆరోపించారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు.. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలి పెట్టనని హెచ్చరించారు.
Yuva Galam Padayatra Book: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు మంత్రి నారా లోకేష్.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. కానీ, వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి.