Pemmasani Chandrasekhar: గండికోటను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని గండికోటకు సుమారు 78 కోట్ల పర్యాటక శాఖ నిధులను కేటాయించాం అని తెలిపారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తో కలిసి పెమ్మసాని గండికోట ప్రాంతాన్ని ఈరోజు పరిశీలించారు. శిథిలమైన నిర్మాణాలను, అద్భుతమైన శిల్పకళ నైపుణ్యాన్ని పరిశీలించిన ఆయన ఈ ప్రాంతాన్ని మరో గ్రాండ్ కెన్యాన్ గా పర్యాటక అభివృద్ధి దిశగా నడిపించాలని అన్నారు.
Read Also: CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఇక, శ్రీకృష్ణదేవరాయలు హయాంలో భారతదేశం మొత్తంపై దండయాత్రలు జరిగినా గండికోటను మాత్రం శత్రువులు చేదించలేకపోయారు అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాదాపు 200 ఏళ్లకు పైగా మనవాళ్లు ఈ కోటను, విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడారు.. అందులో ప్రధాన పాత్ర పోషించిన చీఫ్ కమాండర్ పెమ్మసాని రామలింగ నాయుడు కవచంలా నిలబడ్డారని గుర్తు చేశారు. 1350వ సంవత్సరం నుంచి 1550వ సంవత్సరం వరకు అనేక మంది ఈ గండికోటను శత్రు దుర్బేధ్య కోటగా నిర్మించడంతో పాటు పాలించారని వెల్లడించారు. విజయనగర సామ్రాజ్య యుద్ధాలలో మెలకువలు తెలిసిన సైనికులను తయారు చేయడంలోనూ, సైనిక శిక్షణ ఇవ్వడంలోనూ ఈ ప్రాంతం పేరుగాంచింది.. శత్రువులు కోట లోపలకు అడుగు పెట్టడానికి వీలు లేకుండా అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో ఈ కట్టడాలు నిర్మించారని పెమ్మసాని పేర్కొన్నారు.
Read Also: Kerala: నదిలో చిక్కుకున్న కారును బయటకు లాగిన ఏనుగు.. వీడియో వైరల్
అయితే, శ్రీకృష్ణదేవరాయలు అనంతరం ఇక్కడి కట్టడాలు బాగా పాడుబడ్డాయని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. ఇంతటి ఘన చరిత్ర, మన భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. అమెరికాలోని గ్రాండ్ కెన్యాన్ కూడా ఇలాగే ఉంటుంది.. కానీ అక్కడ గ్రాండ్ కెన్యా న్ కి గండికోటలో లాగా నది ప్రవాహం ఉండదు.. ప్రకృతి అద్భుత నిర్మితమైనటువంటి కొండలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు అన్నారు. ఈ ప్రాంతం మా పూర్వీకులకు చెందినది కాబట్టి.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశాం.. కేంద్ర టూరిజం శాఖ మంత్రితో మాట్లాడి సుమారు రూ. 78 కోట్ల నిధులను గండికోట అభివృద్ధి కోసం కేటాయింపు చేసుకున్నాం.. కాంట్రాక్ట్ టెండర్లని తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.. ఎమ్మెల్యే కూడా చొరవ చూపి పనులు త్వరగా పూర్తయ్యేలా చేస్తామని భరోసా ఇచ్చారు.. సీఎం చంద్రబాబు శ్రీకృష్ణదేవరాయలు 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని కేంద్రమంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.