Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు.. ఇప్పుడు ప్రజలే ఫుట్ బాల్ ఆడుతున్నారు.. మన నాయకుడిని అరెస్టు చేశారు.. ఇప్పుడు ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి ప్రజలు తాళాలు వేశారని ఎద్దేవా చేశారు. ఇక, ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఓ ప్రభంజనం.. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.. సీబీఎన్ అంటే డెవలప్మెంట్.. సీబీఎన్ అంటే సంక్షేమం, సీబీఎన్ అంటే మనందరి ధైర్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
Read Also: Shakur Khan: పాక్ గూఢచారి షకుర్ ఖాన్ అరెస్ట్.. రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!
ఇక, అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటం హాలీ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక, నా పైన కూడా 23 కేసులు పెట్టారు.. తగ్గేదే లేదు అని ఆనాడే చెప్పాం.. విధ్వంసం పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.. ఒక్క కంపెనీ తీసుకురాక పోగా ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు వెళ్లేలా చేశారు.. జే బ్రాండ్ లిక్కర్ పేరుతో మద్యం కంటే విషం పంచారు అని ఆరోపించారు. అయితే, పవన్ కళ్యాణ్ నాకు అన్నతో సమానం.. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి మన కోసం పని చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో ఫ్రీబస్ ను నా అక్కా చెల్లెమ్మలకు కల్పిస్తున్నాం అన్నారు. అలాగే, 16 వేల మందితో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం.. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు.. ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం కూటమి సర్కార్ పరిష్కరిస్తుంది.. 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిరాయి, దీని ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
అలాగే, వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డ కుటుంబాలను కలుస్తున్నాను అని మంత్రి లోకేష్ తెలిపారు. వైసీపీ కార్యకర్తల్లారా ఏనాడైనా మీ నాయకుడు కలిశారా?.. 25 ఎంపీ స్థానాల్లో కూటమి 21 స్థానాల్లో గెలిచింది.. దీంతో కేంద్ర ప్రభుత్వం మనతో కలిసి పని చేస్తుంది.. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు సహజం.. మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు ఉండకూడదు.. ఈగోలు వదిలి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. ఇక, తల్లిని చెల్లిని గెంటింది ఎవరు?.. బాబాయినీ చంపింది ఎవరు?.. జే బ్రాండ్ అమ్మి ప్రజల రక్తం పీల్చింది ఎవరు?.. అందరూ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు.. ఎందుకయ్య అంత భయం.. రెడ్ బుక్ అనగానే ఒకడికి గుండెపోటు, ఇంకొడికి బాత్ రూంలో కాలు విరిగింది, మరొక్కడు ఎక్కడ ఉన్నాడో తెలియదు.. అర్థ మైందా రాజా.. రాయలసీమ గడ్డా టీడీపీ అడ్డా అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.