నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాతా హోటల్ పక్కన జంపాలవారిపాలెంలో టీడీపీ నేత తోపూరి నరసింహం అనే వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు బ్రహ్మయ్య అనే వ్యక్తి.. అంతటితో ఆగకుండా.. రెండు రోజులు నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు.
మాజీ సీఎం వైఎస్ జగన్పై హాట్ కామెంట్లు చేశారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వలేరన్న ఆయన.. ఇంకా ఏం మిగిలిందని జగన్ 2.0 చూపిస్తాడు..? అని ప్రశ్నించారు..
చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. వైఎస్సార్ జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం... NTR జిల్లా పేరు వెనుక విజయవాడను ఎందుకు చేర్చలేదు..? అని ప్రశ్నించారు.. కుచితమైన ఆలోచనలతో టీడీపీ వ్యవహరి స్తోంది అని దుయ్యబట్టారు.. ప్రభుత్వం సింగిల్ పాయింట్ అజెండా ఫాలో అవుతోంది..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు ట్విస్ట్లు పెరుగుతూనే ఉన్నాయి. టీడీపీ తరపున మూడు సార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచిన వంశీ... ఒకసారి వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగారు.
కొందరు వివాదం కోసం మాట్లడుతుంటారు.. మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోదామని వాయిస్ పెంచుతుంటారు. కానీ... వాటన్నిటితో సంబంధం లేకుండా... మనసులో ఏది ఉంటే అది మాట్లాడి.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయంగా సమాధి అవుతావు అంటూ వైఎస్ జగన్కు కీలక సూచనలు చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై స్పందించారు.. టీడీపీ మహానాడుకు వెళ్తే.. అక్కడి జనాలను చూసి మైండ్ పోయిందన్నారు.. అక్కడ వచ్చింది లీడర్లు కాదు.. సామాన్య ప్రజలే ఎక్కువ అన్నారు..
Pemmasani Chandrasekhar: గండికోటను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని గండికోటకు సుమారు 78 కోట్ల పర్యాటక శాఖ నిధులను కేటాయించాం అని తెలిపారు.
రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: జన సముద్రంతో కడప నిండిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చేస్తే ప్రజలు అండగా ఉంటారని కడప ప్రజలు నిరూపించారు.. ఉదయం నుంచి అన్ని దారులు కడప వైపే చూస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన మొదటి మహానాడు సూపర్ హిట్ అయింది..
Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు.