CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు.
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. ఆ పసుపు పండుగపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు.
మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ... ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది... ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది... అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట అధిష్టానం..
తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా... కడపలో మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గురువారంతో.... ఈ మూడు రోజుల వేడుక ముగుస్తుంది. ఇక వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారట సీఎం చంద్రబాబు.
కడప జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం అనే అజెండాతో మొదటి రోజు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు ప్రధాన అంశాలను సభ ముందు ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
భారతదేశంలో మరలా పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేసి.. ఆర్ధిక లావాదేవీలను డిజిటల్లో మార్చిచే అవినీతిని రూపుమాప వచ్చన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సప్ గవర్నర్స్ తీసుకొచ్చాం అని, ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు…
తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పు రావాలని, మహానాడు వేదికగా మరో 40 సంవత్సరాలు పార్టీ నడపడానికి కావలసిన అంశాలపై చర్చించాలన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏపీలో నేరస్తులకు చోటు లేదని, ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తామన్నారు. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం అని, తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేశాం అని.. అవినీతిపై పోరాటం చేస్తే ఇప్పుడు సీబీఐ విచారణ చేసే పరిస్థితి…
ప్రాణ సమాణమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ కడప మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆరంభించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం అని సీఎం తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం అని, ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది…