జగన్ ఒక రంగుల రెడ్డి, జగన్ వి చీప్ పాలిటిక్స్.. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని... గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్ లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమేనన్నారు.
ప్రకాశం జిల్లా కొండేపిలో ఎస్సై రమేష్ బాబుపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి.. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పా జగన్ ? అని నిలదీశారు.
ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సరిగ్గా ఏడాది క్రితం రాష్ర్టంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్న ఆయన.. ప్రజలను వేధించి వేయించుకు తిన్న సైకో నేతకు చాచి కొట్టినట్లు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు..
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
Nara Lokesh: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని వెల్లడించారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna Reddy: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల క్రితం వంశీని విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం కోసం జాయిన్ చేసిన జైలు అధికారులు..
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇంటికి వెళ్ళి రేషన్ అందించే పద్ధతి తీసేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారు.. తన ఒత్తిడి కారణంగా వెళ్తున్నారని మంత్రి కొండపల్లి ఇన్ఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు.. తన ఆదేశాలు లేకుండా మంత్రిని కలిస్తే కఠిన చర్యలే.. గ్రీవెన్ లో ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజార్చటంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన హయాం, చంద్రబాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ ట్వీట్టర్ వేదికగా వివరాలను తెలియజేశారు.