ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా జేసీ బ్రదర్స్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని కేసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండివచ్చారు.. రిలీజైన వెంటనే మళ్లీ కేసులు వెంటాడాయి. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ…
ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని… మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని ఆరోపించారు. read also :ఏపీ కరోనా అప్డేట్..తగ్గిన కేసులు దాడి చేయడమే కాకుండా…
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారా? షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంలో ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోమాట మాట్లాడుతున్నారా? ఇంతకూ ఎవరా ఎమ్మెల్యేలు? ఆ తగువు వెనక అసలు కథేంటి? విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్‌పై చర్చ విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80…
తాడిపత్రి రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కూల్చివేతలు.. మాటల తూటాల వెనక పొలిటికల్ పన్నాగం ఇంకేదో ఉందనే చర్చ జరుగుతోంది. మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానం ఒకరిది. రూల్ పాటించకపోతే ఎలా అని చట్టానికి పదును పెడుతున్నారు ఇంకొకరు. దీంతో ఆదిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఆక్రమణల కూల్చివేతలతో రాజకీయ వేడి! ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ పాగా వేసింది. జేసీ బద్రర్స్ ఎత్తుగడలే దానికి కారణం. సింపుల్ మార్జిన్‌తో…
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని…
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 50 డివిజన్లలో 46 చోట్ల వైసీపీ విజయం సాధించిగా, మూడు చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుంది. అత్యధిక డివిజన్లు సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ముందునుంచే చెప్తూ వస్తున్నారు. చెప్పిన విధంగానే వైసీపీ 46 చోట్ల విజయం సాధించడం విశేషం. గెలుపొందిన 46 డివిజన్లలో మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి. ఇకపోతే, ఏలూరులో వీలైనన్ని స్థానాలు గెలుపొంది పట్టును నిరూపించుకోవాలని చూసిన టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం మూడు…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు సజ్జల.. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీసిన ఆయన.. ఇక, టీడీపీ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…