రమ్య హత్యను పని లేని టిడిపి నాయకులు రాజకీయం చేస్తున్నారని…లోకేష్ బరువు తో పాటు విచక్షణ కోల్పోయారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. సీఎం గా జగన్ మోహన్ రెడ్డి వున్నంత వరకు లోకేష్ జీరోగా నే వుంటారని… గ్రామ స్థాయి నాయకులు కంటే తక్కువగా లోకేష్ భాష వుందని చురకలు అంటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పై వ్యక్తి గత దూషణలకు లోకేష్ దిగడం దారుణమన్నారు. స్టేషన్ నుంచి విడుదలైన లోకేష్ ఏదో విజయం…
తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా ఆ పార్టీలకు పరీక్షే. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ ఆ జాబితాలో చేరింది. ఉనికి కోసం క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో పోటీ చేస్తాయో లేదో తెలియదు. బరిలో ఉన్నవారికి మద్దతిస్తాయో లేదో కూడా అర్థం కాదు. మొత్తానికి గుంపులో గోవిందగా మారిపోయాయి. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ అంతేనా? హుజురాబాద్‌లో పోటీ చేస్తాయా లేదా? తెలంగాణాలో కొన్నిపార్టీలకు ఎన్నికలంటేనే దడ. ఒక రాజకీయపార్టీగా అలా నడిపించేద్దాం అని అనుకుంటున్న సమయంలో హుజురాబాద్ బైఎలక్షన్…
అసలే నియోజకవర్గాలలో అంతంత మాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి. మెరుగు పరుచుకోవడానికి అవకాశం వచ్చినా ఆ ముగ్గురు సద్వినియోగం చేసుకోలేదట. అందుకే కేడర్ వారిపై గుర్రుగా ఉంది. మళ్లీ చూద్దామన్న నేతల మాటలను జీర్ణించుకోలేకపోతున్నారట. లాభం లేదని అధినేతకు ఫిర్యాదులు చేశారట తమ్ముళ్లు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో ఇంఛార్జ్‌లపై తమ్ముళ్లు ఫైర్! చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తీ, తిరుపతి నియోజకవర్గాల ఇంఛార్జులు ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో చర్చగా మారారు. చంద్రగిరి ఇంఛార్జ్…
అక్కడ రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నేత ఉన్నారు. కానీ.. ఆయనతో వర్కవుట్ కాదని కేడర్ అంటోందట. మళ్లీ గెలవాలంటే.. నేతను మార్చాల్సిందే అంటున్నారట. కొత్త నేత ఎవరో కూడా కేడర్ డిసైడ్ చేసిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? కేడర్ వద్దనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు? కొత్త నేతను సెట్ చేసుకుంటోన్న టీడీపీ కేడర్? గుంటూరు జిల్లా వినుకొండ. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. వరసగా రికార్డు మెజారిటీతో గెలిచిన జీవీ…
వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం. రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ! అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే…
అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం…
ఆమె ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుందా? ప్రచారంపై ప్రేమ కూడా అంతేనా? కంటెంట్ కంటే కటౌట్‌ను నమ్ముకుంటారా? ఇప్పుడు సీఎం దృష్టిలో పడితే జాతకం మారిపోతుందనే ఆశల్లో ఉన్నారా? అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోవడం లేదా? తాజాగా ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఫీట్లు.. పాట్లు.. పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరిచాయట. అవేంటో.. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో రజనీ హడావిడి! విడదల రజని. గుంటూరు జిల్లా చిలకలూరిపేట…
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు! ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల…