ఆ టీడీపీ సీనియర్ నేత ఆంతర్యం ఏంటో పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. రాజీనామా చేస్తానన్న తేదీ దగ్గర పడి ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం దూతలు వచ్చారు.. వెళ్లారు. వారేం మాట్లాడారో.. హైకమాండ్ బుజ్జగించిందో లేదో తెలియదు. దీంతో ఆయన ఉంటారా.. వెళ్తారా అని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఆయనెవరో.. ఆ బుజ్జగింపులేంటో.. ఈ స్టోరీలో చూద్దాం. చంద్రబాబు ఫోన్ చేసినా గోరంట్ల కాల్ లిఫ్ట్ చేయడం లేదా? టీడీపీ సీనియర్ నేత, పొలిట్బ్యూరో సభ్యుడు..…
ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని నారా లోకేష్ సెటైర్లు వేశారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లను జగన్ రెడ్డి కూల్చేసారని మండి పడ్డారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని..నిప్పులు చెరిగారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమన్నారు నారా లోకేష్. ప్రొక్లయినర్లతో పెకలించిన భరత…
చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయోజనం చేసే ప్రయత్నం చేశారు.. కానీ, వైఎస్ జగన్ సర్కార్ హయాంలో పరిస్థితి మారిపోయిందన్నారు ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ 26 నెలల కాలంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ స్థాయి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ స్థాయికి ఎదిగారని అభివర్ణించారు. ఈ రెండేళ్ల కాలంలో సుమారుగా 69 వేల కోట్ల రూపాయల ప్రయోజనం బీసీలకు చేకూరిందన్న…
సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోందని.. కానీ ఈ రోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం మన దురదృష్టమన్నారు.…
టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన స్టైల్ లో స్పందించారు. బుచ్చయ్య రాజీనామా వ్యవహారంతో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయంటూ ఆయన పేర్కొన్నారు. “‘బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్…
తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి…
మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష…
కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్…
ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు…
తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది. కొన్నాళ్ల క్రితమే..…