ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు చూసి తర్వాత కోర్టుకి వెళ్తాం అని తెలిపారు.
ఇక టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ మాట్లాడుతూ… రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. బ్లాంక్ జీవోలపై గవర్నర్ కి పిర్యాదు చేయగానే ఆన్లైన్లో జీవోలు లేకుండా చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ప్రభుత్వం భయపడుతుంది. జీవోల అంశంపై న్యాయ పోరాటం చేస్తాం. జీవోలు సామాన్యులు మళ్లీ చూసే విధంగా ప్రభుత్వంపై కూడా న్యాయ పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.