మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తే.. ఇక, మంత్రులు.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా.. చంద్రబాబు, లోకేష్‌పై ఒంటికాలితో లేస్తున్నారు కొడాలి నాని.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న యరపతినేని శ్రీనివాసరావు.. మంత్రి కొడాలిపై హాట్ కామెంట్లు చేయడం చర్చగా మారింది.