టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన స్టైల్ లో స్పందించారు. బుచ్చయ్య రాజీనామా వ్యవహారంతో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయంటూ ఆయన పేర్కొన్నారు. “‘బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్ తీర్పు కదా!” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్ లో… రమ్య ఘటనపై స్పందించారు విజయసాయిరెడ్డి. ”అచ్చోసిన ఆంబోతులా కొడుకును గాలికి వదిలేసిన చంద్రబాబు కుతంత్రాలు పూర్తిగా నేర్పినట్టు లేదు. ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారో విన్నావా లోకేశం. మీ అబ్బ స్థాయిలో డ్రామా రక్తి కట్టించాలంటే ఇంకా టైం పడుతుంది. ఎల్లో మీడియా ఎలివేషన్లు సరిపోవడం లేదు.” అంటూ వెల్లడించారు.