తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారని.. మరి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన పై కేసు పెట్టాలా..? ఉరిశిక్ష వేయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మా వర్గాల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు చేస్తున్న లబ్ధిని చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.