వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం. రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ! అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే…
అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం…
ఆమె ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుందా? ప్రచారంపై ప్రేమ కూడా అంతేనా? కంటెంట్ కంటే కటౌట్‌ను నమ్ముకుంటారా? ఇప్పుడు సీఎం దృష్టిలో పడితే జాతకం మారిపోతుందనే ఆశల్లో ఉన్నారా? అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోవడం లేదా? తాజాగా ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఫీట్లు.. పాట్లు.. పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరిచాయట. అవేంటో.. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో రజనీ హడావిడి! విడదల రజని. గుంటూరు జిల్లా చిలకలూరిపేట…
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు! ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల…
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది. వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట! వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వైసీపీపై…
అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో ఇప్పుడు ఏపీలో రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తోంది.. అయితే, ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అంతేకాదు.. టీడీపీ నేతలకు సవాల్ కూడా విసిరారు.. అమర రాజా విషయంలో టీడీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినా రోజా.. అది రాజకీయ సమస్య కాదు కాలుష్యం సమస్య అన్నారు.. ఎల్జీ పాలిమర్ విషయంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు ? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో కాలుష్యం…
కాసేపటి క్రితమే… రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వై.సి.పి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడబోమని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తోపాటు టిడిపి నేతలు నాకు మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పారని.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్టు చేశారని..దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో దాదాపు ఏడు…
కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న ఆ మాజీ మంత్రి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ప్రజాసమస్యలపై ఏకంగా రోడ్డెక్కుతున్నారు. పోయినచోటే వెతుక్కోవాలని అనుకుంటున్నారో.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారో కానీ.. నష్ట నివారణకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? హైదరాబాద్‌లో కేసు తర్వాత సొంత వర్గం దూరమైందా? వివాదాలు, కేసుల కారణంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కొంతకాలంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు దూరంగా ఉన్నారు. క్యాడర్‌కు కూడా అందుబాటులో లేరు. ఆళ్లగడ్డలో యురేనియం…