తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీలు ఐక్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాటానికి దిగాయి. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.
టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాట కార్యాచరణ ఈ రోజు మొదలుకానుంది. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించాలని ఉభయపార్టీలు నిర్ణయించాయి..
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ - జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇక, ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ - జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీలో కీలక అంశాలపై నేతలు చర్చించారు. ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో తెలుగుదేశం - జనసేన పార్టీలు ప్రకటించాయి. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్‌కుమార్ ఉన్నారు.
ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది.
ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది.
ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలను జనసేన పార్టీ ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకున్నారు.