TDP-Janasena: వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ.. కలిసి కార్యాచరణ రూపొందించుకున్నాయి.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాట కార్యాచరణ ఈ రోజు మొదలుకానుంది. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించాలని ఉభయపార్టీలు నిర్ణయించాయి..
Read Also: Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. నాలుగేళ్ల కూతురికి ఉరేసి దంపతులు ఆత్మహత్య
18,19 తేదీలలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనున్న టీడీపీ – జనసేన జేఏసీ.. గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేదీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. రెండు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేయాలని నిర్ణయించారు.. #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేయనుంది.. కాగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు.. నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ప్రజాపోరాటాలపై నిర్ణయం తీసుకుంది.