భీమిలిలో సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం సీఎం జగన్ పొందుతున్నారు.. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చ గొట్టే పని చేస్తున్నారు.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం టిక్కెట్ విషయంలో పెరుగుతున్న పోటీ. విజయవాడ పశ్చిమ టికెట్ కోసం అంతర్గతంగా టీడీపీ-జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే.. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి.. రాజధాని రైతులు పడ్డ కష్టం ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ - జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
2024లో జరిగే ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి దూకుడు పెంచారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. టీవీ డిబేట్ లో కొలికపూడి నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు.. నన్ను చంపటానికి లైవ్ లో డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఇచ్చారు అంటూ ఆయన ఆరోపించారు. కొలికపూడి అదే మాట మూడుసార్లు అన్నారు.. కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారు.. అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది..
విశాఖపట్నంలోని పోలిపల్లిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగ సభలో టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పురిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చంద్రబాబు చేరుకోనున్నారు.