జలదంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద్ద పెంచలయ్య సారథ్యం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. తమకు న్యాయం జరగలేదని టీడీపీపై జనసేన నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గడచిన రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి.. చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకుందని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పేంతవరకు, జనసేనకు న్యాయం జరిగేంత వరకు.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉండాలనే…
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి…
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం - జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు.