TDP-Janasena: టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం.. ఆ అంశాలే ప్రధాన అజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రo రూపకల్పన పైనా ప్రధానంగా నేతలు చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి టీడీపీ – జనసేనలు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నాయి. ఓటర్ జాబితా అవకతవకలపైనా ఉమ్మడి పోరుకు ప్రణాళికను రచిస్తున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై జేఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి లోకేష్ సహా ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు హాజరయ్యారు.
Also Read: Bhatti Vikramarka Nomination: నామినేషన్ దాఖలు చేసిన భట్టి విక్రమార్క
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఇదిలా ఉండగా.. ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని టీడీపీ పీఏసీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ భావించింది. ఇసుక, మద్యం, కరువు, ధరలు, ఛార్జీల పెంపు వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచించింది. నియోజకవర్గాల వారీగా టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా జేఏసీలో ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!