Pawan Kalyan: జనసేన, టీడీపీ సారధ్యంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’.. పవన్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీలు ఐక్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాటానికి దిగాయి. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించాలని ఉభయపార్టీలు నిర్ణయించాయి.
Also Read: Adimulapu Suresh: చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేశారు..
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
18,19 తేదీలలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనున్న టీడీపీ – జనసేన జేఏసీ.. “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ” పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. రెండు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేయాలని నిర్ణయించారు.. #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేయనుంది.. కాగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు.. నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ప్రజాపోరాటాలపై నిర్ణయం తీసుకుంది.
Also Read: Purandeshwari: అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది..
ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ” కార్యక్రమాల గురించి పోస్ట్ చేశారు. జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి సారథ్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ” కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ట్విట్టర్ పోస్ట్‌లో “జనసేన, టీడీపీ నేతలు కార్యకర్తల్లారా! గుంతల రోడ్లతో ఎన్నాళ్లు మనకు ఈ పాట్లు? అందుకే 2023 నవంబర్ 18, 19 తేదీలలో రోడ్లపైకి రండి.” అని పవన్ పేర్కొన్నారు.
#HelloAP_ByeByeYCP pic.twitter.com/mwmHDN8t1J
— Pawan Kalyan (@PawanKalyan) November 18, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!