టీడీపీ- జనసేన పార్టీల పొత్తులపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు.. పాడుతా తీయగా కార్యక్రమంలాగా ఇటు ఆరుగురు ఆడు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు.. ఆర సున్న.. ఆర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించారు అనడం కామెడిగా ఉంది అని ఆమె సెటైర్లు వేశారు.
ఇప్పుడు లోకేశ్ కూడా ఏడుస్తున్నాడు.. చంద్రబాబు ఏడుపు నాటకం, లోకేశ్ ఏడుపు ఆవేదన అనిపిస్తుంది.. తన లాంటి చేత గాని పప్పుకు కూడా మూడు శాఖలు ఇచ్చిన తన తండ్రి చంద్రబాబును జైల్లో వేశారని లోకేశ్ ఆవేదన చెందుతున్న పరిస్థితి అని ఆయన అన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి.. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు..
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వుంది. పార్టీలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. ఎన్నికలకు ముందే పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు వున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో…