తమిళనాడులోని నీలగిరి కొండల్లో అరుదైన నల్ల చిరుత ప్రత్యక్షం అయింది. రెండు సాధారణ చిరుతలతో పాటు నల్ల చిరుత కనిపించింది. వాటితో కలిసి తాపీగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

తమిళనాడు రాష్ట్రం నీలగిరి అడవుల్లో ఓ రహదారిపై రెండు చిరుతలతో కలిసి బ్లాక్ పాంథర్ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రహదారిపై దర్జాగా నైట్ వాక్ చేస్తూ వెళ్లాయి. నల్ల చిరుతకు బాడీ గార్డులుగా మరో రెండు సాధారణ చిరుతలు వెళ్లడం కనిపించాయి. ప్రపంచంలో పలు దేశాల్లో మాత్రమే నల్ల చిరుత అరుదుగా దర్శనమిస్తోంది. అంతేకాకుండా సాధారణ చిరుతలు, నల్ల చిరుతల మధ్య తీవ్రమైన వైరం ఉంటుంది. అలాంటిది సాధారణ చిరుతలతో కలిసి నల్ల చిరుత కలిసి నడవం వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: మరో రెండు విదేశీ పర్యటనలకు మోడీ.. షెడ్యూల్ ఇదే!