Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన ఇంఛార్జ్ సహా ఐదుగురి అరెస్ట్..
- తమిళనాడులో కాళహస్తికి చెందిన యువకుడి హత్య..
- చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో మృతదేహం లభ్యం..
- కాళహస్తి గోడౌన్‌లో రాయుడుని చిత్రహింసలకు గురి చేసి హత్య..
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సెవెన్ వెల్స్ పోలీసులు..
- అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యువకుడు.. తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యారు.. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. కాళహస్తి గోడౌన్‌లో రాయుడు అనే యువకుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు ఉన్నారు..
Read Also: Perni Nani: మాజీ మంత్రి సంచలనం..! రప్పా.. రప్పా.. అనేది కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి అంతే..!
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
అయితే, రాయుడును చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసిన నిందితులు.. ఈనెల 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డులోని నివాస ప్రాంతం వెనుక అతడి మృతదేహాన్ని పడవేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగించి హత్యలో పాల్గొన్న కాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్, చంద్రబాబుతో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అసలు, రాయుడును ఎందుకు చిత్రహింసలు పెట్టారు.. అంత దారుణంగా హత్యకు చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. నిందితులను కాళహస్తి తీసుకెళ్లి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు….
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!