తమిళనాడులో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ లాకప్‌డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. అత్యంత దారుణంగా పోలీసులు చితకబాదడంతో దెబ్బలు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.
చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. కాళహస్తి గోడౌన్లో రాయుడు అనే యువకుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు ఉన్నారు..
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ తుక్కుతుక్కు అయిపోయింది. ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
జాకీల సాయంతో ఇళ్లను లిఫ్ట్ చేసి.. ఎత్తు పెంచడం మనందరికీ తెలిసిందే. మొదటిసారిగా ఆలయాలను కూడా లిఫ్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో.. వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు రోడ్డకు దిగువన ఉండడంతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడడాని పలు ఆలయ కమిటీలు లిఫ్ట్ చేసే పద్దతిని అనుసరిస్తున్నాయి. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అనుమతితో ఇప్పటికే 15 ఆలయాల ఎత్తు…
తమిళనాడులోని విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో ఆదివారం పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని హిందుస్థాన్ క్రాకర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని యాబై గదుల్లో 15 గదులు ఫూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ లో పదుల సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఘటనా స్థలి…
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దొంగతనం కేసులో ఆలయ గార్డును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చావబాదారు. పోలీసులు ఇష్టానురీతిగా కొట్టడంతో అజిత్ కుమార్(28) ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక అమాయక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత ఒకే ఒక్క పదం 'క్షమించండి' అని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్‌లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి.
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు.