Tamil Nadu Custodial Death: వెలుగులోకి పోస్ట్‌మార్టం రిపోర్ట్.. ఆందోళన కలిగిస్తున్న అంశాలు
- వెలుగులోకి తమిళనాడు లాకప్ డెత్ పోస్ట్‌మార్టం రిపోర్ట్
- ఆందోళన కలిగిస్తున్న అంశాలు
- తీవ్రమైన గాయాలు కారణంగానే చనిపోయినట్లుగా నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దొంగతనం కేసులో ఆలయ గార్డును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చావబాదారు. పోలీసులు ఇష్టానురీతిగా కొట్టడంతో అజిత్ కుమార్(28) ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దీంతో విపక్ష పార్టీలు.. డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్రం లాకప్ డెత్‌లకు మాతృభూమిగా మారిపోయిందంటూ ధ్వజమెత్తాయి. తక్షణమే స్టాలిన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మద్రాస్ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఒక పౌరుడిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినంటూ ట్రీట్ చేస్తారా? అంటూ ప్రశ్నించింది. ఇక పెను దుమారం చెలరేగడంతో స్టాలిన్ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram : కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదిలో వరద ఉధృతి
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక తాజాగా అజిత్ కుమార్‌కు సంబంధించిన పోస్టుమార్టం వెలుగులోకి వచ్చింది. శరీరంపై 44 గాయాలు ఉన్నట్లుగా తేలింది. అంతర్గత గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇక 3 సెంటీమీటర్లు లీనియర్ మచ్చ, ఇంకో మూడు చోట్ల సిగరెట్‌తో కాల్చిన గాయాలు ప్రత్యక్షమైనట్లు శవ పరీక్షలో తేలింది. అంతేకాకుండా నుదిటి, చేతులు, మోకాలి, పాదం, పిరుదుల ప్రాంతంలో కూడా గాయాలు ఉన్నట్లుగా పోస్టుమార్టం నివేదికలో పేర్కొంది. ఇక మెదడు రక్త నాళాలలో రక్తం అధికంగా పేరుకుపోయినట్లు తేలింది.
ఇది కూడా చదవండి: Himachal: హిమాచల్‌పై జలఖడ్గం.. 63 మంది మృతి.. రూ.400 కోట్ల నష్టం
జూన్ 28న ఆభరణాల దొంగతనం కేసులో శివగంగ పోలీసులు విచారణ కోసం 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ గార్డును తీసుకెళ్లారు. అయితే విచారణ పేరుతో ఐదుగురు పోలీసులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రహస్యంగా ఒకరు చిత్రీకరించారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా పిలిచి వారిపై కూడా ఇలాగే ప్రతాపం చూపించారు. అజిత్ కుమార్ సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడి నోట్లో.. ఒంటిపై కారం చల్లి చితకబాదారని వాపోయాడు. స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు.
ఇక ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్లుగా ఎలా చేస్తారని కోర్టు నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పౌరుడిని చంపేసిందని వ్యాఖ్యానించింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించద్దని న్యాయస్థానం మండిపడింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు బదిలీ చేసింది. అంతేకాకుండా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇక స్టాలిన్ స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సారీ చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!