డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ (శనివారం) ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికులను, అక్కడి దుకాణదారులను ఓట్లు అడిగారు.. పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి టీఎం సెల్వగణపతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెచ వైరల్ అవుతుంది.
Read Also: MS Dhoni E-Cycle: కొత్త ఈ-సైకిల్ తో హల్చల్ చేస్తున్న ధోనీ.. మరి ఆ ఈ-సైకిల్ విశేషాలేంటంటే..?!
అయితే, నిన్న (శుక్రవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈసారి పోటీ చేస్తే ఓడిపోతారనే భయంతోనే ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఇవ్వలేదని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా వచ్చి ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారా అని సీఎం ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు.
#WATCH | Tamil Nadu CM and DMK President MK Stalin campaigns for the party's Salem candidate, TM Selvaganapathy in the Lok Sabha constituency pic.twitter.com/Va6MSNiP5p
— ANI (@ANI) March 30, 2024