తమిళనాడులోని చెన్నైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బార్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ నేత వివాదాస్పద పోస్ట్.. విచారణకు ఆదేశించిన ఢిల్లీ ఎల్‌జీ..
మృతిచెందిన ముగ్గురు కార్మికుల్లో.. ఇద్దరు మణిపూర్‌కు చెందినవారు కాగా.. మరొకరు చెన్నైకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలిసిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Prank turns deadly: ప్రాంక్ ప్రాణం తీసింది.. స్నేహితుడి ప్రైవేట్ పార్టులోకి హై ప్రెషర్ ఎయిర్..
చెన్నైలోని అల్వార్‌పేట్ సెఖ్‌మెట్ క్లబ్ పైకప్పు కూలిపోయింది. మరమ్మత్తులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7.45 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. బాధితులు పబ్‌లోని ఉద్యోగులని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ తర్వాత బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
#WATCH | Chennai: Joint Commissioner East Zone, Dharmaraj says "Three deaths have been reported. We have started the investigation. We can only find out if there is a case against anyone once the reason is known. Based on the investigation, if there is any responsibility to be… pic.twitter.com/cs65UP8DfE
— ANI (@ANI) March 28, 2024
#WATCH | Tamil Nadu: One person dies after the false ceiling inside Sekhmet club in Chennai collapses. Rescue operation underway. Further details awaited: Prem Anand Sinha, Additional Commissioner of Police, Chennai pic.twitter.com/lJsF8Lrcgg
— ANI (@ANI) March 28, 2024