MK Stalin: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే సీఏఏని తమ రాష్ట్రంలో అమలు చేయమని డీఎంకే చెబుతున్న నేపథ్యంలో.. బీజేపీ సీఏఏతో ఆగడని, దాని తరుపరి లక్ష్యం వివిధ భాషల మాట్లాడే ప్రజలే అని ఆయన ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తులో వీటికి సంబంధించిన చట్టాలను తీసుకువస్తుందని ఆయన అన్నారు.
Tamil Nadu: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన తమిళనాడు మంత్రిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వివాదాస్పదం అయ్యాయి. మంత్రి అన్బరసన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అధికార డీఎంకేపై బీజేపీ విరుచుకుపడుతోంది.
బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టి పారేశారు. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.
Tamil Nadu: లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడులో కీలక పరిణామం జరిగింది. ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసింది. అఖిల ఇండియా సమతువ మక్కల్ కట్చీ(AISMK)ని బిజెపిలో విలీనం చేశారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సమక్షంలో శరత్ కుమార్, ఆయన పార్టీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశఐక్యతను పెంపొందించంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు మోడీకి…
Kamal Haasan: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ముందు దేశాన్ని విభజించేందుకు సీఏఏని అమలు చేశారని కమల్ హాసన్ ఆరోపించారు. శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దేశ సామరస్యాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల్ని విభజించి, సామరస్యాన్ని శాననం చేయడానికి ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపనతో,…
Tamil Nadu: మాములుగా నిమ్మకాలకు ఎంత ధర ఉంటుంది..? మహా అయితే రూ. 10కి మించదు. కానీ తమిళనాడులో ఓ ఆలయంలోని నిమ్మకాయ మాత్రం ఏకంగా రూ. 35,000 ధర పలికింది. తమిళనాడులోని ఓ గ్రామంలో ప్రైవేటు ఆలయంలో జరిగిన వేలం పాటులో ఇంత ధర పలకడం చూసి సామాన్యుడు అవాక్కవుతున్నాడు.
Congress: తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. సీట్ల షేరింగ్ ప్రకారం మరోసారి డీఎంకే 2019 ఫార్ములాను రిపీట్ చేసింది. మరోసారి కాంగ్రెస్కి తమిళనాడులో 9 ఎంపీ స్థానాలను కేటాయించింది. ఇక పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 2019 ఎన్నికల్లో 39 లోక్సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ ఆ సమయంలో 9 స్థానాలకు గానూ…
Congress-DMK: లోక్సభ ఎన్నికల తేదీలు ఈసీ విడుదల చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పలు పార్టీల మధ్య పొత్తుల చర్చల్లో వేగం పెరిగింది. తాజాగా తమిళనాడులోని అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్ పూర్తైంది. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)తో కూడా సీట్ల ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీకి 10 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.