ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ఇప్పటి వరకు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 5న చెన్నైలోని పెరంబూర్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్‌ని ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ కేసులో తాజాగా మరో నిందితుడని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Jallikattu: తమిళనాడు జల్లికట్టు వేడులకల్లో విషాదం నెలకొంది. శివగంగలోని కారైకుడిలో నిర్వహించిన మంజువిరాట్టు కార్యక్రమంలో ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఎద్దును మచ్చిక చేసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది.
Ganja In Metro: ఎప్పుడు రద్దీగా ఉండే చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టయిన నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లలో గంజాయి, సిగరెట్లు, మద్యం, స్నాక్స్ తీసుకోవడం నిషేధం. అయితే తొండియార్ లోని భువనేష్ మెట్రోలో చాలా మంది ప్రయాణికుల మధ్య గంజాయి తాగాడు. అతడు గంజాయి తాగుతున్న…
Tamil Nadu: తమిళనాడులో 24 గంటల వ్యవధిలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయమై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ని హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తమిళనాడులోని ఆవడి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)లో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ వెపన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మైలాడుతురై జిల్లా ముట్టపుదుపేట్‌కు చెందిన కాళిదాస్ (55)గా గుర్తించారు. అతనికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు.